W.G: నరసాపురం–సఖినేటిపల్లి రేవు (ఫెర్రీ) బహిరంగ వేలం పాట ఇవాళ ఉత్కంఠ భరితంగా సాగింది. నరసాపురం ఎంపీడీవో కార్యాలయంలో వేలం పాట నిర్వహించారు. ఈ వేలంలో కోనసీమ జిల్లా, టేకు శెట్టిపాలెం గ్రామానికి చెందిన విఘ్నేశ్వర సాండ్ క్వారీ & బోట్స్ మాన్ లేబర్ కాంట్రాక్టు కోపరేటివ్ సొసైటీ అత్యధికంగా రూ.3,70,01,000 పాడుకుని రేవు నిర్వహణ హక్కులను దక్కించుకుంది.