ADB: కేంద్రంలో నిర్వహించిన కరాటే గ్రేడింగ్ టెస్ట్ ఉత్సాహంగా సాగింది. బోధి బుడోకాన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముకేశ్ కుమార్ చేతుల మీదుగా ప్రతిభ కనబరిచిన వారికి బెల్టులు పంపిణీ చేశారు. ఠాకూర్ రాము, దేవిదాస్లకు 5వ డాన్ బ్లాక్ బెల్ట్ దక్కగా.. సునీత, రాహుల్‌లకు 3వ డాన్ బెల్టులు లభించాయి. పలువురు ప్రముఖులు ఈ క్రీడాకారులను అభినందించారు.