రోహిత్ శర్మ ఫామ్‌పై ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేల జయవర్ధనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ ఈ సీజన్లో చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నాడని తెలిపాడు. ప్రాక్టీస్ క్యాంప్ మొదటి రోజు నుంచే జట్టుతో చేరి, పూర్తి ఏకాగ్రతతో సాధన చేశాడని పేర్కొన్నాడు. ప్రస్తుతం రోహిత్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని, KKRతో అతడు ఆడిన ఇన్నింగ్స్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించాడు.