తెలంగాణలో బతుకమ్మ పండుగ మాదిరిగానే.. ఉత్తరాఖండ్ కొండ ప్రాంతాల్లో ఫూల్ దెయ్ పండుగ ఘనంగా నిర్వహిస్తారు. వసంత కాలపు రాకకు గుర్తుగా ఈ వేడుకను జరుపుకుంటారు. నెలరోజుల పాటు సాగే ఈ ఉత్సవంలో చిన్నారులే ప్రధాన ఆకర్షణ. పిల్లలు కొండల నుంచి రంగురంగుల పూలు తెచ్చి ప్రతి ఇంటి గుమ్మం వద్ద ఉంచుతారు. లోకకల్యాణం కోరుతూ పాటలు పాడే పిల్లలను, పెద్దలు బియ్యం, బెల్లం కానుకలతో దీవిస్తారు.