TG: శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సస్పెండ్ అయ్యారు. ఎమ్మెల్సీలు మధుసూధనా చారి, తాత మధు, వాణీ దేవీలను ఛైర్మన్ సస్పెండ్ చేశారు. అయితే శాసనమండలిలో సస్పెన్షన్ అనేది ఇప్పటివరకు లేదని.. ఇదే మొదటిసారి అని ఛైర్మన్ వెల్లడించారు. కాగా, మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ సంస్థ చేస్తున్న మైనింగ్ అక్రమాలపై సభా సంఘం ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది.