AP: రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాల విద్యార్థులకు వేసవిలో డ్రై రేషన్ అందించనుంది. 51 మండలాల్లోని 2 నుంచి పదో తరగతి విద్యార్థులకు ఇది వర్తిస్తుంది. ప్రాథమిక విద్యార్థులకు 4 కిలోలు, ఉన్నత పాఠశాల విద్యార్థులకు 6 కిలోల బియ్యం ఇస్తారు. వీటితో పాటు 35 కోడిగుడ్లు, 21 చిక్కీలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం ద్వారా వేలాది మందికి లబ్ధి చేకూరనుంది.