NTR: కంచికచర్ల జుజ్జూరు రోడ్డులోని గ్యాస్ ఏజెన్సీ వద్ద సోమవారం వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సిలిండర్ల పంపిణీలో సమయపాలన పాటించకపోవడంతో ఖాళీ బండలతో నడిరోడ్డుపై వెయిట్ చేస్తున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. మధిర ప్రధాన రహదారి కావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఏజెన్సీ నిర్లక్ష్యంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.