E.G: నిడదవోలు మండలం తాడిమల్ల గ్రామంలో శ్రీ రాజగోపాల స్వామి, పార్వతి రామలింగేశ్వర స్వామివారి వార్షిక కల్యాణ మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు వేదమంత్రాల మధ్య కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ ప్రజలు, భక్తులు భారీగా పాల్గొని భక్తిశ్రద్ధలతో సేవలు అందించారు.