KKD: జగ్గంపేట శివారులో పేకాట రాయుళ్లను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగ్గంపేట ఎస్సై టి. రఘునాథరావు సమాచారం మేరకు సిబ్బందితో తనిఖీ చేపట్టగా, ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.6,150 స్వాధీనం చేసుకున్నారు. వీరిని రేపు కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు. బెట్టింగ్, పేకాట ఆడే వారిపై కఠన చర్యలు ఉంటాయని ఎసై హెచ్చరించారు.