BDK: కిన్నెరసాని పర్యాటక కేంద్రం ఆదివారం సందర్శకులతో కిటకిటలాడింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన 265 మంది పర్యాటకులు డ్యాం డీర్ పార్క్‌ను సందర్శించి సందడి చేశారు. దీని ద్వారా వైల్డ్ లైఫ్ శాఖకు రూ. 15,635 ఆదాయం సమకూరింది. అలాగే 210 మంది పర్యాటకులు బోటు షికారు చేయడంతో టూరిజం కార్పొరేషన్‌కు రూ.12,860 ఆదాయం లభించింది అని అధికారులు తెలిపారు.