దేశంలో గ్యాస్, పెట్రోల్ కొరత వదంతులతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సుపీరియర్ కిరోసిన్ పంపిణీకి నిర్ణయం తీసుకుంది. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సుపీరియర్ కిరోసిన్ పంపిణీ చేయనుంది. సర్వీస్ స్టేషన్లలో 2500 లీటర్ల వరకు కిరోసిన్ నిల్వకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.