రణధీర్ బీసు, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మిరాకిల్’. ప్రభాస్ నిమ్మల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంపై దర్శకుడు తాజాగా కీలక అప్డేట్ ఇచ్చాడు. సరికొత్త కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, ఇప్పటికే 90 శాతం షూటింగ్ పూర్తయిందని పేర్కొన్నాడు. మిగిలిన భాగాన్ని కూడా త్వరలోనే పూర్తి చేసి, సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నాడు.