KRNL: ఆదోని మండలం సంతే కుడ్లూరు గ్రామానికి చెందిన బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు కురువ మాలింగప్ప బ్రెయిన్ స్ట్రోక్తో ఆదివారం కర్నూలులో చికిత్స పొందుతూ.. మృతి చెందారు. ఆయన మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. విషయం తెలిసిన ఎమ్మెల్యే పార్థసారథి సహా పార్టీ నేతలు సంతాపం తెలిపారు. సోమవారం స్వగృహంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.