AP: విశాఖ గాజువాకలో జరిగిన మౌనిక హత్య కేసులో నిందితుడు రవీంద్ర సంచలన విషయాలు బయటపెట్టాడు. మౌనిక డేటింగ్ యాప్‌లో పరిచయమైందని, రూ.3.50 లక్షలు ఇచ్చినట్లు తెలిపాడు. జాబ్ ఐడీ కార్డు తీసుకుని డబ్బులు డిమాండ్ చేసినట్లు పేర్కొన్నాడు. నెల క్రితం విజయనగరంలోని పుట్టింటికి తన భార్య వెళ్లడంతో మౌనికను ఇంటికి పిలిచినట్లు తెలిపాడు. రవీంద్ర నేవీలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు.