PLD: రెంటచింతల మండల పరిధిలోని మంచికళ్లు బుగ్గ వాగు రిజర్వాయర్లో గుర్తుతెలియని మృతదేహం లభ్యమవటంతో కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు మృతదేహాన్ని గుర్తించారు. మృతుని వయస్సు 35 ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. తలభాగం నీటిలోకి బోర్లా పడి ఉండటంతో చేపలు మృతదేహాన్ని పీకుతున్నాయి. ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.