మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ క్రమంలో భారత్ తన ఇంధన భద్రత కోసం హార్మూజ్ జలసంధి వద్ద అత్యంత కీలకమైన ‘ఆపరేషన్ ఊర్జా సురక్ష’ను ప్రారంభించింది. ఇందులో భాగంగా హార్మూజ్ జలసంధి సమీపంలో సుమారు ఐదుకు పైగా ఫ్రంట్లైన్ యుద్ధనౌకలు నిరంతరం పహారా కాస్తూ, భారత జెండా కలిగిన ఇంధన నౌకలకు ‘రక్షణ కవచం’గా నిలుస్తున్నాయి.