WNP: గోపాల్పేట మండల కేంద్రంలోని శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి రథోత్సవం (తేరు) అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తుల కోలాటాలు, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.