»Revanth Reddy Comments On Mlc Creates Controversy
Revanthreddy : శాసన మండలిపై రేవంత్ వ్యాఖ్యలు.. ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీలు
శాసనమండలిపై ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విపక్ష ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.
Revanthreddy : శాసనమండలిపై ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విపక్ష ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శాసనమండలిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసనమండలిని ఇరానీ కేఫ్‌గా, సభ్యులను రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా రేవంత్ అభివర్ణించారు.
ఈ వ్యాఖ్యలపై పలువురు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రేవంత్‌పై మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్సీ సురభివాణీ దేవి ఫిర్యాదు చేశారు. సురభి వాణీదేవితో పాటు ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్, దేశపతి శ్రీనివాస్ కూడా ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన కాపీని మీడియాకు విడుదల చేశారు. రేవంత్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని, ఈ సందర్భంగా రేవంత్‌పై చర్యలు తీసుకోవాలని, ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఫిర్యాదులో పేర్కొన్నారు. శాసనమండలి సభ్యులను భూ డీలర్లుగా, దళారులుగా అభివర్ణించడం సరికాదన్నారు. కౌన్సిల్లో చాలా మంది నిజాయితీపరులు ఉన్నారని, కళా, సాంస్కృతిక, విద్యా రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారని వ్యాఖ్యానించిన రేవంత్‌పై చర్యలు తీసుకోవాలని ఎథిక్స్ కమిటీని ఫిర్యాదులో కోరారు.