KMR: మద్నూర్ మండల మార్కెట్ యార్డ్లో సింగిల్ విండో ఆధ్వర్యంలో శెనగ పంట కొనుగోళ్ల వివరాలు గ్రామాల వారీగా షెడ్యూల్ ప్రకటించినట్లు మద్నూర్ గ్రామ ఏఈవో సౌమ్య ఆదివారం తెలిపారు. శెనగ కొనుగోళ్లు ఈనెల 30 నుంచి ఏప్రిల్ 1 వరకు జరుగుతాయని ఆమె తెలిపారు. రైతులు తమ పంటను తీసుకువచ్చి మద్దతు ధరతో కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవాలని ఏఈవో తెలిపారు.