TG: ఐక్యతే అభివృద్ధికి మూలమని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సంగారెడ్డిలో నిర్వహించిన వీరశైవ లింగాయత్ సమాజ సమావేశానికి రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీరశైవ లింగాయత్ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. సమాజ ఐక్యతే అభివృద్ధికి మూలమని పేర్కొంటూ, అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.