KNR: సుందరగిరిలో గొర్రెలు, మేకల వారసంత వేలంపాటను శనివారం నిర్వహించారు. ఇందులో మొత్తం ఆరుగురు పోటీపడగా హుస్నాబాద్‌కు చెందిన ఐలేని కిషన్ రెడ్డి అత్యధికంగా రూ.7.73 లక్షలకు వేలం కైవసం చేసుకున్నారు. గతేడాదితో (రూ.7 లక్షలు) పోలిస్తే ఈసారి రూ.73 వేలు అదనంగా రావడం గమనార్హం. సంతను సక్రమంగా నిర్వహించాలని సూచిస్తూ కిషన్ రెడ్డిని మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాల్గొన్నారు.