TG: తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల జీతం నెలకు 15శాతం లేదా రూ.10 వేలు కట్ చేసి తల్లిదండ్రుల ఖాతాల్లో వేస్తారు. ప్రత్యేక అధికారికి ఫిర్యాదు చేస్తే.. 60 రోజుల్లోగా చర్యలు తీసుకోవాలి. తల్లిదండ్రుల్లో ఒకరు చనిపోతే ఆ భృతిని మరొకరికి.. ఇద్దరూ చనిపోతే ఆ వేతనం ఉద్యోగి ఖాతాల్లోనే వేస్తారు. ఇది ప్రభుత్వ ఉద్యోగులు, MLA, MLCలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచుకూ వర్తిస్తుంది.