NLG: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 1న ‘బ్లాక్ డే’ నిర్వహించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు దండెంపల్లి సత్తయ్య పిలుపునిచ్చారు. ఆదివారం కనగల్ మండలం, దోరేపల్లిలో జరిగిన యూనియన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే 29 చట్టాలను రద్దు చేశారని విమర్శించారు.