KRNL: ఎమ్మిగనూరు చేనేత కో-ఆపరేటివ్ సొసైటీ సర్వసభ్య సమావేశం ఈనెల 31న వివర్స్ కాలనీ మైదానంలో నిర్వహించనున్నట్లు వైసీపీ పార్లమెంట్ ఇంఛార్జ్ బుట్టా రేణుక తెలిపారు. ఈ సమావేశంలో సొసైటీని ఆప్కోలో విలీనం చేయాలన్న ప్రయత్నాలను సమీక్షించి, దానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవాలని సభ్యులను కోరారు. పద్మశ్రీ మాచాని సోమప్ప స్థాపించిన సొసైటీని ఆయనకు గుర్తుగా నిర్వహించారు.