PLD: అమరావతి మండలం మునగోడులో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడాలనే లక్ష్యంతో దుర్భర పరిస్థితులకు చెక్ పెట్టేందుకు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని తెలిపారు.