IPLలో తన 19 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంపై మనీష్ పాండే భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ సీజన్లో KKR తరఫున బరిలోకి దిగుతున్న పాండే, తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సుదీర్ఘ ప్రయాణం రెప్పపాటులో గడిచిపోయినట్లు అనిపిస్తోందని తెలిపాడు. ‘2009లో RCB తరఫున సెంచరీ సాధించడం ఇప్పటికీ మర్చిపోలేను. ఆటపై ఉన్న ఇష్టమే నన్ను ఇన్నాళ్లు కొనసాగేలా చేసింది’ అని మనీష్ పేర్కొన్నాడు.