KRNL: రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు మేకల భిక్షం ఆదివారం ఆదోని మండలం అరెకల్లోని డా. బీఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల వసతి గృహాన్ని పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న విద్యా, వసతి, ఆరోగ్య సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి చేరాలని విద్యార్థులను ప్రోత్సహించారు.