AP: ఆదివాసీలకు ఎమ్మెల్యే బెందాళం అశోక్ క్షమాపణ చెప్పారు. ఓ వ్యక్తి వ్యక్తిగతంగా మాట్లాడటంపై స్పందించానని తెలిపారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని ప్రకటించారు. తన మాటలు ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని కోరారు. కాగా తమ సమస్యలను చెప్పుకోవడానికి వచ్చిన ఆదివాసీలతో ఎమ్మెల్యే అగౌరవంగా మాట్లాడిన విషయం తెలిసిందే.