VSP: ఎన్జీవో కోపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీని పరిరక్షించాలని పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. అక్కయ్యపాలెం వేణుగోపాల స్వామి ఆలయ ఆడిటోరియంలో ఆదివారం జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ప్రస్తుత పాలకవర్గం అక్రమాలపై సభ్యులు ధ్వజమెత్తారు. ఇందులో ప్రస్తుత అధ్యక్షుడు ఎస్.ఎం. మౌలాలి, కార్యదర్శి సబ్బం కిరణ్, సభ్యులు అచ్యుతరావు, కేఎస్వీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.