AKP: కోటవురట్ల మండలంలో ఈనెల 31లోగా వంద శాతం ఇంటి పన్నులు వసూళ్లు చేయాలని ఎంపీడీవో చంద్రశేఖర్ ఆదేశించారు. ఆదివారం కోటవురట్ల శివారు రాట్నాలపాలెంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఇంటి పన్నులు వసూలు చేశారు. మండలంలో మొత్తం రూ.77.66 లక్షలు వసూళ్లు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.63.87 లక్షలు వసూళ్లు చేసామన్నారు.