SDPT: హుస్నాబాద్ మండలం పందిళ్ళ గ్రామంలో మహిళా గ్రూప్స్ ఆధ్వర్యంలో “ఉల్లాస్ “ద్వారా గ్రామంలోని వయోజనులు అందరికీ ప్రవేశ పరీక్షను నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా చదువురాని మహిళలందరికీ చదవడం, రాయడం నేర్పించడమే ఉల్లాస్ పథకం ప్రధాన లక్ష్యం అని సర్పంచ్ తోడేటి రమేష్ అన్నారు. ఉపసర్పంచ్ పెండ్యాల సంపత్ రెడ్డి, మహిళా సంఘం అధ్యక్షురాలు రాజమణి రజిత, పాల్గొన్నారు.