»Police Conducted Drunken Drive And Drug Detectors Checks In 3 Commissionerates Of Hyderabad
New Year: రెండున్నర గంటల్లోనే 1060 డ్రంకన్ డ్రైవ్ కేసులు
నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆదివారం రాత్రి 9 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. నగర పరిధిలోని పబ్‌లు, బార్లు, రిసార్ట్‌ల వద్ద పోలీసులు గట్టి నిఘా పెట్టారు.
New Year: నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆదివారం రాత్రి 9 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. నగర పరిధిలోని పబ్‌లు, బార్లు, రిసార్ట్‌ల వద్ద పోలీసులు గట్టి నిఘా పెట్టారు. బేగంపేట, లంగర్ హౌస్ ఫ్లై ఓవర్లు మినహా 3 కమిషనరేట్లలోని అన్ని ఫ్లైఓవర్లు, అండర్‌పాస్ వంతెనలు మూతపడ్డాయి. 59 ట్రాఫిక్ పీఎస్‌లలో మొత్తం 260 చెక్పాయింట్లు నిర్వహించారు. టీ నాబ్ పోలీసులు డ్రగ్ డిటెక్టర్లతో తనిఖీలు నిర్వహించారు. నక్లెస్ రోడ్లు, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్ వైపు రహదారులను మూసివేసినప్పటికీ యువకులు పెద్దఎత్తున సచివాలయానికి తరలివచ్చారు. దీంతో పోలీసులు కూడా జనాన్ని అదుపు చేయలేక చేతులెత్తేశారు.
మరోవైపు, డ్రగ్స్ పరీక్షల్లో భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలిలోని పబ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లలో పోలీసులు మఫ్టీలో వెళ్లి తనిఖీలు చేపట్టారు. వారితో పాటు స్నిపర్ డాగ్‌లను కూడా తీసుకెళ్లారు. నిబంధనలు ఏ మేరకు పాటిస్తున్నారో పరిశీలించారు. గంజాయి, డ్రగ్స్ వాడుతున్న వారి కోసం గాలింపు చేపట్టారు. 3 కమిషనరేట్లలోని చెక్ పాయింట్ల వద్ద ఔషధ పరీక్షలు నిర్వహించారు. దీంతో 11.30 గంటల్లోనే అంటే కేవలం రెండున్నర గంటల్లోనే మొత్తం 1060 కేసులు నమోదయ్యాయి. పోలీసుల తనిఖీల్లో నలుగురు డ్రగ్స్ సరఫరాదారులు పట్టుబడ్డారు. డ్రంక్ డ్రైవింగ్ కేసులు, డ్రగ్స్ టెస్ట్ కేసుల వివరాలను నేడు మీడియా సమక్షంలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.