AP: తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే తనకు అధినేతలు అని మంత్రి లోకేష్ అన్నారు. పార్టీ ఆవిర్భావ వేడుకల్లో మాట్లాడుతూ.. గత YCP హయాంలో ఎన్నో సమస్యలు ఎదురైనా, తల మీద కత్తి పెట్టినా, వెనక్కి తగ్గకుండా ‘జై తెలుగుదేశం’ అని ఎందరో కార్యకర్తలు నినాదించారని పేర్కొన్నారు. TDPని అడ్రస్ లేకుండా చేస్తామన్నవాళ్లే ఇప్పుడు ఆచూకీ లేకుండా పోయారన్నారు.