ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష చూపుతున్నాయని ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్ మండిపడ్డారు. ఎయిర్పోర్ట్, ADB-ఆర్మూర్ రైల్వే లైన్ మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతోందని విమర్శించారు. BRS, కాంగ్రెస్, BJPలు జిల్లాను విస్మరిస్తున్నాయని, ప్రజాప్రతినిధులు స్పందించి తక్షణమే ఈ ప్రాజెక్టులు మంజూరు చేయించాలన్నారు.