KRNL: పెద్దకడబూరులో సీఎస్ఐ, ఆర్సీఎం చర్చిల నందు క్రైస్తవ సోదరులు మట్టల ఆదివారాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచి స్థానిక చర్చి నందు ప్రత్యేక ప్రార్థల అనంతరం ఈత మట్టలను చేతబూని ‘హోసన్నా జయముహోసన్నా జయము’ అనే నినాదాలతో గ్రామ పుర వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. పాస్టర్ మనోహర్ బాబు, ఫాదర్ రాజేంద్ర మట్టల ఆదివారం విశిష్టతను భక్తులకు సందేశమిచ్చారు.