అన్నమయ్య: కడప-చెన్నై హైవేపై ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపుతప్పి కరెంట్ పోల్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికి ప్రాణాపాయం కలగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, పోల్ విరగడంతో పుల్లంపేటలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు స్థానికులు పేర్కొన్నారు.