ATP: అనంతపురం పట్టణంలో పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. థింక్ గ్యాస్ కనెక్షన్ కోసం రిజిస్టర్ చేసుకున్న 8200 మంది వినియోగదారులకు వెంటనే కనెక్షన్లు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఇందుకోసం రిసోర్స్ పర్సన్లు, మెప్మా సిబ్బందితో ప్రత్యేక టీములను సైతం ఏర్పాటు చేశారు.