ప్రకాశం: టంగుటూరులో రూ. 50 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, సైడ్ డ్రెయిన్లను మంత్రులు డోలా బాల వీరాంజనేయస్వామి, బీసీ జనార్దన్ రెడ్డి, మ్యారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు.