NGKL: జిల్లాలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు పాలెం ఇండస్ట్రియల్ పార్క్‌ను సందర్శించారు. ఈకో క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పర్యటనలో భాగంగా ప్లాస్టిక్ రీసైక్లింగ్ ప్రక్రియను విద్యార్థులు ప్రత్యక్షంగా పరిశీలించారు. పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణపై విద్యార్థుల్లో అవగాహన కల్పించడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు.