IPL 2026లో ఇవాళ ముంబై, కోల్‌కతా జట్లు ఢీకొననున్న సంగతి తెలిసిందే. ఇందులో గెలిచి సీజన్‌కు శుభారంభం పలకాలని ఇరుజట్లు చూస్తున్నాయి. అయితే గణాంకాల ప్రకారం ముంబైని కట్టడిచేయడం కోల్‌కతాకు కష్టమే. ఇప్పటివరకు తలపడిన 35 సందర్భాల్లో MI 24-11తో KKRపై ఆధిపత్యం చలాయిస్తోంది. అటు ఇవాళ్టి మ్యాచ్ జరిగే వాంఖడేలో MIతో 12 మ్యాచులాడిన KKR రెండింటిలోనే గెలిచింది.