సత్యసాయి: పెనుకొండ మండలం అంబేద్కర్ సర్కిల్లో కూటమి నేతలు సోమవారం నిరసన చేపట్టారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. భారతీయ జనతా యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు కుళ్లాయప్ప యాదవ్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసి, చెప్పులతో తొక్కి నిరసన వ్యక్తం చేశారు. ‘కాంగ్రెస్ హటావో – దేశ్ కో బచావో’ అంటూ నినాదాలు చేశారు.