BDK: క్రీడా పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం శనివారం పాల్వంచ మండలం కిన్నెరసాని క్రీడా పాఠశాలలో విద్యార్థులకు తుది ఎంపికలు చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని గిరిజన సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి చంద్రమోహన్ పర్యవేక్షించారు. విద్యార్థుల ఎంపికలో తీసుకోవాల్సిన చర్యలను సిబ్బందికి సూచించారు. క్రీడల ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.