BDK: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం పాల్వంచ శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ పసుపులేటి వీరబాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. నిరుద్యోగులు గ్రంథాలయ సేవలను వినియోగించుకుని విజ్ఞానాన్ని పెంపొందించుకొని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలిపారు.