SRCL: ముస్తాబాద్ మండల కేంద్రంలో శనివారం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఉపాధి హామీ, 15వ ఆర్థిక సంఘం నిధులతో సుమారు రూ.13 లక్షల అంచనాతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు ఆయన భూమిపూజ నిర్వహించారు. అనంతరం ఇందిరమ్మ కాలనీలో రూ.7.50 లక్షలతో చేపట్టనున్న మురికి కాలువ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.