KNR:సైదాపూర్ మండలం వెన్నంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజన సభ శనివారం జరిగిన విషయం తెలిసిందే. పీఏసీఎస్ పర్సన్ ఇన్ఛార్జ్ ముంజాల శ్రీనివాస్ నూతనంగా ఎన్నికైన సర్పంచులను ఘనంగా సత్కరించారు. సంఘం పరిధిలోని వెన్నంపల్లి సర్పంచ్ చిరంజీవి, ఆరెపల్లి-లావణ్య, లస్మన్నపల్లి-స్వప్న, గర్రెపల్లి-శ్రీకాంత్, ఏక్లాస్పూర్-భాగ్య లక్ష్మిని శాలువాలతో సత్కరించారు.