BHPL: జిల్లా కేంద్రంలోని ZP హైస్కూల్లో నిర్వహిస్తున్న 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చీఫ్ సూపరింటెండెంట్ లక్ష్మి ప్రసన్నను పరీక్షలకు హాజరైన విద్యార్థుల సంఖ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ పరీక్షా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరాన్ని కూడా పరిశీలించారు.