సత్యసాయి: అమరావతి రాజధాని చట్టబద్ధత కోసం నిర్వహించిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి లోకేశ్‌ను కలిసి పలు అంశాలపై చర్చించారు. వీరిద్దరి మాటామంతీ సభలో అందరి దృష్టిని ఆకర్షించింది. హిందూపురం అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించినట్లు తెలుస్తోంది.