ప్రకాశం: సింగరాయకొండ హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయం శనివారం వినియోగదారులతో కిక్కిరిసింది. ఏజెన్సీలో సిలిండర్ల కోసం ప్రజలు క్యూ కట్టారు. ఇరాన్ యుద్ధ ప్రభావంతో ముడి చమురు ధరలు పెరిగి, మున్ముందు గ్యాస్ కొరత మరింత తీవ్రమవుతుందనే ఆందోళన ప్రజల్లో నెలకొంది. ఈ భయంతో జనం గ్యాస్ సిలిండర్ల కోసం బారులు తీరుతున్నారు.