SDPT: బెజ్జంకి మండలం గుండారం గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీరు, రహదారులు, మౌలిక వసతుల సమస్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. సమస్యలను ఓపికగా విన్న మంత్రి, పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధికి తోడుంటానని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ తాళ్లపెళ్లి భీమయ్య, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.