HYD: SR నగర్ PS పరిధి బీకేగూడలోని ఒక నివాసంలో అక్రమంగా నిర్వహిస్తున్న వ్యభిచార కేంద్రంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు రమేశ్ రెడ్డి, వంశీతో పాటు కస్టమర్ లక్ష్మణ్‌ను అరెస్ట్ చేసి, బెంగళూరుకు చెందిన ఇద్దరు యువతులను రక్షించారు. నిందితుల నుంచి రూ. 2,150 నగదు, 3 ఫోన్లు, ఒక యాక్టివాను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పై కేసు నమోదు చేశారు.